తెలంగాణ వీణ , రాష్ట్రీయం : కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి హర్షం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మి, మల్లాపూర్ డివిజన్, అశోక్ నగర్ లో, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిబండారి లక్ష్మారెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 600ల మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరి, బండారి లక్ష్మారెడ్డి కి తమ పూర్తి మద్దతును తెలియజేశారు. ఈ సందర్బంగా వారందరికీ బీ ఎల్ ఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు