తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. నోటీసులివ్వకుండా.. విచారణ జరపకుండా ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని చెప్పారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదని తెలిపారు. మధ్యంతరం బెయిల్ రావడం మంచిదేనని పేర్కొన్నారు.