తెలంగాణ వీణ , జాతీయం : నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, కేంద్రమంత్రి అమిత్ షా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, కేంద్రమంత్రి మీనాక్షి లేఖి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ఇంత పెద్ద దేశాన్ని ఏకం చేయడంలో వల్లభాయ్ పటేల్ కృషి చాలా ఉందని, లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదని చెప్పారు.