తెలంగాణ వీణ ,సినిమా : టాలీవుడ్ సీనియర్ హీరో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు మేకర్స్..వెంకటేశ్ 75వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా వెంకీ అండ్ టీం చిల్ అవుట్ మూడ్ లో ఉన్న లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది అంటూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.చంద్ర ప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.. అలాగే ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైంధవ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. సైంధవ్ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్ గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో అలాగే కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో కనిపించనున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన సైంధవ్ టీజర్ సినిమా పై ఆసక్తి పెంచేస్తోంది. సైంధవ్ సినిమా ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.వెంకటేష్ ఈ సినిమా లో మాస్ క్యారెక్టర్ లో అలరించునున్నాడు.. లెక్క మారుద్ది అంటూ వెంకీ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి…