తెలంగాణ వీణ, సినిమా : టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. నాని 30 గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లను లాంఛ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ వదలనున్నట్లు తెలిపారు.ఈ మూవీలోని థర్డ్ సింగిల్ అమ్మాడి సాంగ్‌ను నవంబర్ 04న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. ఇక ఈ పాటను తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.