తెలంగాణ వీణ సినిమా : మరో రెండు రోజుల్లో అందాల భామ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనులు మొదలు అయ్యాయి. నవంబర్ 2 న ఇటలీలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకున్నారు. ఇక ఈ పెళ్లి కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈనెల 31న హల్దీ, మెహందీ వేడుకలతో పెళ్లిసందడి మొదలు కానుంది. ఇకపోతే ఈ పెళ్లి కోసం.. లావణ్య, నిహారికకు ఫాలో అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక- చైతన్య పెళ్లి జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్లు కూడా నిండకుండానే ఈ జంట కొన్ని విభేదాలు వలన విడిపోయారు. అయితే మెగా ఫ్యామిలీలో అత్యంత వైభవంగా జరిగిన పెళ్లి అంటే నిహారికదే అని చెప్పాలి. ఈ పెళ్ళిలో నిహారిక.. తన తల్లి పెళ్లి పట్టుచీరను కట్టుకొని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను లావణ్య కూడా పాటిస్తోందని తెలుస్తోంది. లావణ్య తల్లి.. ఆమె పెళ్లి రోజున కట్టుకున్న చీరను మోడ్రన్ గా డిజైన్ చేయించి తన పెళ్లి రోజున లావణ్య కట్టుకోనున్నదని తెలుస్తోంది. తన తల్లి చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఈ వదినా ఆడపడుచులు మాత్రమే కాకుండా ఈ కాలం అమ్మాయిలందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. తల్లి పెళ్లి చీరను.. తమ పెళ్లి చీరగా మార్చుకొని కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. మరి ఈ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.