తెలంగాణ వీణ : మ్యాడ్ మూవీ రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు… ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ క్రియేట్ చేసిన కామెడీ ప్రేక్షకులని ఎంతగానో నవ్వించింది.సినిమా లోని పంచ్ డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 25 కోట్లకుపైగా గ్రాస్‌ను, 12 కోట్ల కు పైగా షేర్‌ను రాబట్టింది. మ్యాడ్ మూవీ నిర్మాతలకు మూడింతల లాభాల్ని మిగిల్చింది. మ్యాడ్ మూవీ లో డైరెక్టర్ కేవీ అనుదీప్ కూడా అతిథి పాత్ర లో కనిపించి అలరించాడ. భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ మూవీకి సంగీతాన్ని అందించాడు.థియేటర్స్ లో అదరగొట్టిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది..నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే..మనోజ్ అశోక్ దామోదర్ అనే ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కాలేజీ లైఫ్ గురించి మ్యాడ్ సినిమా తెరకెక్కింది. కాలేజీ లైఫ్‌తో పాటు వారి ప్రేమకథల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అనే కథ ను డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వినోదాత్మకం గా తెరకెక్కించారు..