తెలంగాణ వీణ , జాతీయం : పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు.