తెలంగాణ వీణ , జాతీయం : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది.
వివరాల ప్రకారం.. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్ తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న వారిని కలుసుకొని హేమంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారి ఉద్యమానికి హేమంత్ పాటిల్ మద్దతు ప్రకటించారు.