తెలంగాణ వీణ , మెదక్ : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం మెదక్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్‌రావు ఫోన్‌లో పరామర్శించారు. మెదక్ హుటాహుటిన బయల్దేరారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్‌ఎస్ నేతలకు హరీష్‌రావు సూచించార