తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తనపై దాడి వెనుక పెద్ద కుట్ర జరుగుతోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీకానీ, వ్యక్తిగానీ బ్రతికి బట్ట కట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పీకే అంటే పవన్ కల్యాణ్ కాదు.. కేకే(కిరాయి కోటిగాడు) అని విమర్శించారు.
అయితే, ఇటీవల ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై కొందరు టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటిని వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను పరామర్శించడానికి వచ్చిన వారికి ధన్యవాదాలు. నాపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. నన్ను భౌతికంగా తొలగించాలని గతంలోనే ఇక సమావేశంలో చెప్పారు. నా మీద దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారు. వారిలో ఆరుగురుని అరెస్ట్ చేశారు. వారంతా ఒకే సామాజికి వర్గానికి చెందినవారు.
కమ్మ వర్గంలో ఉగ్రవాదులు..
కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారు. వారు టీడీపీని నాశనం చేస్తున్నారు. టీడీపీ అంత బలంగా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా?. భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీకానీ, వ్యక్తిగానీ బ్రతికి బట్ట కట్టలేదు. ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండించాను. పవన్ కల్యాణ్ అంటే పీకే కాదు.. కిరాయి కోటిగాడు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి ఖండించడు. ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీదకు వచ్చి పడుకుంటాడు’ అని ఎద్దేవా చేశారు.