తెలంగాణ వీణ,క్రీడలు : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 59 బంతుల్లోనే తన సెంచరీని అందుకున్న ట్రావిస్… 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఒక అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును ఇప్పుడు ట్రావిస్ బ్రేక్ చేశాడు.