తెలంగాణ వీణ,క్రీడలు : ధర్మశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసింది. అతి భారీ లక్ష్యం అయినప్పటికీ న్యూజిలాండ్ ఏమాత్రం అధైర్యపడకుండా ఛేజింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం జట్టు స్కోరు 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు. ఆ జట్టు విజయానికి ఇంకా 27 ఓవర్లలో 232 పరుగులు చేయాలి. క్రీజులో డారిల్ మిచెల్ (54 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర (31 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్లు డెవాన్ కాన్వే (28), విల్ యంగ్ (32) తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి ఫర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరినీ ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ పెవిలియన్ కు పంపించాడు. అయితే, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర జోడీ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.