తెలంగాణ వీణ,హైదరాబాద్ : కారు టైరు పేలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్ శివార్లలో జరిగింది. మృతుడు వరప్రసాదరావు (51) గచ్చిబౌలిలోని టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. దసరా పండుగ కోసం తమ సొంత ఊరు విజయనగరానికి కుటుంబంతో సహా వెళ్లారు. అక్కడి నుంచి భార్య నీలవేణి, కుమారుడు నెహంత్, తండ్రి లక్ష్మణ్ రావు హైదరాబాద్ కు వస్తుండగా… ఆదిభట్ల వద్ద కారు టైరు పేలింది. దీంతో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న ప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి, భార్య, కుమారుడికి గాయాలయ్యాయి.