తెలంగాణ వీణ, సినిమా : ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన వారు తాము హైదరాబాద్ లో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో నివసిస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో చిన్న గొడవ జరిగిన సందర్భం కూడా లేదని చెప్పారు. నగర ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు ఉన్నాయని అన్నారు. రాత్రిపూట నగర అందం మరింత పెరుగుతుందని చెప్పారు. ‘భగవంత్ కేసరి’ సినిమా కోసం ఫ్లైకామ్ షాట్స్ తీసినప్పుడు హైదరాబాద్ అందాలు చూసి అబ్బురపడ్డానని తెలిపారు. మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ అని… హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోవడానికి కేటీఆర్ కృషి కారణమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఆయన అందరినీ కలుపుకుపోతారని కితాబునిచ్చారు.