తెలంగాణ వీణ, సినిమా : ప్రముఖ నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కోలీవుడ్ దిగ్గజ నటుడు తంబి రామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య వివాహ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటుండగా అక్టోబర్ 27న చెన్నైలో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఉమాపతి రామయ్య, ఐశ్వర్య కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలోపడ్డారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి ప్రతిపాదన చేశారు. అంగీకారం లభించడంతో వివాహానికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా తంబి రామయ్య ప్రముఖ హాస్యనటుడిగా, సహాయ నటుడిగాను చాలా తమిళ సినిమాల్లో నటించారు.ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.