తెలంగాణ వీణ , హైదరాబాద్ : మామూలు రోజుల్లోనే మల్లారెడ్డి అంటే ఒక వైరెటీ. ఇక ఎన్నికల ప్రచారం వేళ ఆయన ఇంకెంత వైరెటీగా దూసుకుపోతారో ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా ఆయన హాజరయ్యారు.
ఓ నాయకుడి ఇంటి వద్ద కూర్చున్న మహిళలు, వృద్ధుల వద్దకు మంత్రి మల్లారెడ్డి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. గౌరమ్మ అనే వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెకు పూల బొకే ఇచ్చి సరదాగా ముచ్చటించారు.