తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో టికెట్ ఆశించిన దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి నేడు పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.