తెలంగాణ వీణ , హైదరాబాద్ : రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొన్నారు. అభ్యర్థులు కందాల ఉపేందర్ రెడ్డి, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్‌లను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయా సభల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ధ్వజమెత్తారు. ‘ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రైతు బంధు వేస్ట్ అని అంటున్నడు. పీసీసీ అధ్యక్షుడేమో3 గంటల కరెంటు చాలు అని అంటున్నడు. రైతు బంధు దుబారానట. రైతు బంధు వేస్ట్ అట. కాంగ్రెసోళ్లు గెలిస్తే రైతుబంధుకు రాంరాం చెబ్తరు. వాళ్లొస్తే కరెంటు కాటగలుస్తది. అందుకే ఎవరికి ఓటేయాల్నోనిర్ణయించుకోండి. రైతుబంధు వచ్చే ఏడాదికి 12 వేలు చేస్తం. క్రమంగా దాన్ని 16 వేలకు పెంచుతూ పోతం. పేదలకు ఇబ్బంది కాకుండా 400కే సిలిండర్ ఇస్తం’ అని మరోమారు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు