తెలంగాణ వీణ, ఉప్పల్ : వాకర్స్ తో వాకింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉప్పల్ మునిసిపల్ గ్రౌండ్ లో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సభ్యులుతో చాయిపే ములాఖత్ పేరుతో ఆత్మీయంగా కలవడం జరిగింది.తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అలాగే అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, ఎన్నికల మేనిఫెస్టోను, కేటిఆర్ నాయకత్వంలో పెరిగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వాకర్స్ కి వివరిస్తూ, తెలంగాణకు బిఅర్ఎస్ పార్టీ, కేసిఆర్ శ్రీరామరక్ష అని తెలుపుతూ, తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలిపిన లెజెండ్ కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోవాలంటే, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.బండారి లక్ష్మారెడ్డి తో ఆత్మీయంగా మాట్లాడిన వాకర్స్ నుండి విశేష స్పందన లభించింది. 75 యేండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని, తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపించిన దార్శనికుడు కేసీఆర్ అంటూ, బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి, ఉప్పల్ నియోజకవర్గం నుండి అత్యంత భారీ మెజారిటీతో బండారి లక్ష్మారెడ్డి ని అసెంబ్లీకి పంపిస్తామని ఏకగ్రవంగా తీర్మానం చేశారు..ఈ కార్యక్రమంలో చిల్కనగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మరియు పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.