తెలంగాణ వీణ : హైదరాబాద్ కాప్రా ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, రెండు పూటలా భోజనం పెట్టి సేవ చేశానన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని రకాల సర్వేల్లో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తాడని తేలినా రేవంత్ రెడ్డి మాత్రం ఓడిపోయే మూడో స్థానంలో ఉన్న పరమేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే పరమేశ్వర రెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనకు మోసం చేసిందని, రేవంత్ రెడ్డి వాడుకుని అహంకారంతో తన గొంతును తడి బట్టతో కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రజలు తిరస్కరిస్తే మల్కాజిగిరి నుండి ఎంపీగా గెలిపించి సొంత తమ్ముడిగా సొంత డబ్బులు ఖర్చు చేసి ఎంతో చేస్తే రేవంత్ రెడ్డి వాడుకుని వదిలేశాడని తెలిపారు. త్వరలోనే రేవంత్ బాధిత సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రజాకార్ల రాజ్యం వస్తుందని తెలంగాణను అమ్మే స్తాడని సోమశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేను మోస పోయినట్టు ఇంకెవరూ మోసపోవద్దని రేవంత్ రెడ్డి వద్ద మోసపోయిన అందరూ తనతో కలిసి రావాలన్నారు. కొడంగల్ లో రేవంత్ మోసాలను ప్రజలకు తెలియజేసి రేవంత్ రెడ్డిని ఓడిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వదిలి రేపు తన సతీమణి ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు.