తెలంగాణ వీణ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన కూన శ్రీశైలం గౌడ్. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ విచ్చేశారు. అనంతరం వారిని పరామర్శించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం ఎన్టీవీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన గెలుపు ఎవరిది ప్రోగ్రాం లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న భూ కబ్జాల గురించి వివరించిన
కూన శ్రీశైలం గౌడ్ పై బీ ఆర్ ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ భౌతిక దాడి చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఓడిపోతాననే భయంతోనే ముందస్తు పథకం ప్రకారం కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేయడం జరిగిందని, పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుల వ్యవహరిస్తున్నారని అని అన్నారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బందోబస్తు పెట్టమని పోలీసులకు ముందే చెప్పిన పట్టించుకోలేదని, బిజెపి కార్యకర్తలు, అభిమానులు ఎవరు సహనం కోల్పోవద్ద ని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. జరగబోయే ఎన్నికలలో కుత్బుల్లాపూర్ ప్రజలే ఇటువంటి రౌడీ కి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.