తెలంగాణ వీణ, సినిమా : అమలా పాల్ రెండో వివాహాం మీద ఎన్నెన్నో రూమర్లు, ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ మధ్య రెండో వివాహాం అంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. అదో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.బోల్డ్ బ్యూటీ అమలా పాల్ ప్రస్తుతం సింగిల్‌గానే ఉంది. దర్శకుడు విజయ్‌తో వివాహాం, విడాకుల తరువాత ఒంటరిగానే ఉంటూ వచ్చింది. మధ్యలో పంజాబి సింగర్‌తో రిలేషన్ అంటూ రూమర్లు వచ్చాయి. ఇద్దరికీ పెళ్లి అయిపోయిందంటూ ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ ఓ ప్రకటన కోసం చేసిన ఫోటో షూట్ అని ఆ తరువాత మళ్లీ వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలన్నీ కూడా అమల్ పాల్, సదరు సింగర్ ఖాతాల నుంచి మాయం అయిపోయాయి. ఆ తరువాత సింగర్‌తో అమల్ పాల్ రిలేషన్ చెడిందని, అందుకే ఫోటోలన్నీ మాయం అయ్యాయనే రూమర్లు వచ్చాయి.ఆ తరువాత అమలా పాల్ రెండో పెళ్లి మీద పెద్దగా వార్తలేమీ రాలేదు.కానీ ఆమె మాత్రం ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిందని సమాచారం. జగత్ దేశాయ్ అనే వ్యక్తి వేసిన పోస్ట్ చూస్తే అమలా పాల్ రెండో సారి పెళ్లికి రెడీ అయిందని అర్థం అవుతోంది. జగత్ దేశాయ్ అనే వ్యక్తితో అమలా పాల్ కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉందని తెలుస్తోంది. నేడు అమలా పాల్ బర్త్ డే సందర్భంగా ఇలా ఈ గుడ్ న్యూస్‌ను బయటపెట్టారనిపిస్తోంది.
https://www.instagram.com/reel/Cy2ZeoxB_Yl/?utm_source=ig_embed&utm_campaign=loading