తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలయింది. చంద్రబాబు తరపు అడ్వకేట్లు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని… ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
మరోవైపు, చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెపుతున్నారు. అయితే నివేదికను మార్చి ఇవ్వాలంటూ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు మండిపడుతున్నారు. హెల్త్ బులెటిన్ లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.