తెలంగాణ వీణ , హైదరాబాద్ : వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మూడోసారి విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి తలసానికి ఇంటింటా మంగళ హారతులు పట్టి, శాలువాలతో సత్కరించి సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని స్పష్టం చేశారు. సనత్ నగర్‌ను గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి చేశాం.
మురుగు నీరు, తాగు నీరు సమస్యలు తీర్చామని చెప్పారు. అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి. మరింత అభివృద్ధి కోసం అత్యధిక మెజార్టీతో తనని గెపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.