తెలంగాణ వీణ , హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గురువారం యాదగిరి, ఉమాదేవి,సాయికుమార్ మరియు
గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి శోభయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గణేష్ నగర్ లో దసరా పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి తొమ్మిది రోజులు అలంకరణలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. గురువారం అమ్మవారి యొక్క శోభాయాత్ర ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభాయాత్ర ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రజలందరి పై ఎల్లవేళలా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులందరూ మరియు భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు