తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని చిక్‌బళ్లాపూర్ ఎస్పీ నగేష్ పరిశీలించారు. ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు.