తెలంగాణ వీణ, సినిమా : బాలీవుడ్ లో అందమైన జంటల్లో దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ ల జంట ఒకటి. ఐదేళ్ల క్రితం 2018లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి జరిగి ఐదేళ్లయినా చిన్న మనస్పర్థకు కూడా తావివ్వకుండా సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. వీరి పెళ్లి ఇటలీలో అతికొద్ది మంది సమక్షంలో జరిగింది. వీరి పెళ్లి జరిగి ఐదేళ్లయినా… వివాహానికి సంబంధించిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ తన షో ‘కాఫీ విత్ కరణ్’లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ షోలో తాజాగా దీపిక, రణవీర్ సందడి చేశారు. పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారి పెళ్లి వీడియోను చూపించి కరణ్ ఆశ్చర్యపరిచాడు.
TweetHD – 2 | deepveer wedding 🧿❤️ pic.twitter.com/zQGvgG9Jyp
— Deepika Files (@FilesDeepika) October 25, 2023