తెలంగాణ వీణ , హైదరాబాద్ : తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై డీకే అరుణ స్పందించారు.
ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో పని చేయడం తన అదృష్టం అని డీకే అరుణ అన్నారు.