తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి అనే విషయం మరోసారి రుజవైందంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాతెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు.