Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్‌ నంబర్‌ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు.

బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్‌ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తనకు ఫోన్‌ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్‌ చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you