తెలంగాణ వీణ , జాతీయం : రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరుల మధ్య భూవివాదం దారుణ హత్యకు దారి తీసింది. సోదరుడిని ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి హత్య చేశాడు ఓ కసాయి అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్పుర్కి చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాలు గ్రామంలోని కొంత భూమిపై ఏళ్లుగా గొడవపడుతున్నారు. ఇవాళ ఉదయం రెండు కుటుంబాలు వివాదాస్పద భూమిపై చర్చించుకోవడానికి ఒక చోట చేరాయి. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఘర్షణ సమయంలో, అతర్ సింగ్ కుమారులలో ఒకరైన నిర్బత్ నేలపై పడిపోయాడు. అప్పటికే ట్రాక్టర్ పై ఉన్న నిర్బత్ సోదరుడు వాహనాన్ని ఆయనపై నుంచి వాహనాన్ని పోనించాడు. అలా ట్రాక్టర్ ని ముందుకు వెనక్కి తిప్పుతూ 8 సార్లు నిర్బత్ పై నుంచి నడిపాడు. తీవ్ర గాయాలపాలైన నిర్బత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు ఆపాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే రెండు కుటుంబాలు ఘర్షణ పడుతున్నప్పుడు తుపాకుల శబ్దాలు వినిపించాయని గ్రామస్థులు అంటున్నారు