తెలంగాణ వీణ , జాతీయం : రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ రావత్ మంగళవారం అర్ధరాత్రి హల్ద్వానీ నుంచి ఉదమ్ సింగ్ నగర్ లోని కాశీపుర్ కి కారులో బయల్దేరారు. బాజ్ పుర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఆయనను చాలా సేపు ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ ఘటనలో రావత్ కు స్వల్ప గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు ఆయన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జీ చేశారు. ఆయన హెల్త్ పై డాక్టర్లు హెల్త్ బుటిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం రావత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వారు తెలిపారు. అయితే ప్రమాదంపై రావత్ ఎక్స్(X) లో పోస్ట్ చేశారు. “హల్ద్వానీ నుంచి కాశీపుర్ కి వెళ్తున్న టైంలో నా కారు ప్రమాదానికి గురైంది. బాజ్ పుర్ లో డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాకు గాయాలయ్యాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం హెల్త్ అంతా బాగానే ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి ఆరోగ్యంగానే ఉన్నా.