Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వాషింగ్ మెషీన్లో 1.30 కోట్లు.. 

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అక్రమంగా తరలిస్తున్న రూ. 1.30 కోట్ల నగదును విశాఖ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని ఆటోలో వాషింగ్ మెషీన్ లో ఉంచి విజయవాడకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును విశాఖలోని ఒక ఎలక్ట్రానిక్ షాప్ కు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. విశాఖ ఎయిర్ పోర్టు పరిసరాల్లో తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో ఈ డబ్బు పట్టుబడింది. డబ్బుకు సంబంధించిన బిల్లులను చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ డబ్బును ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పజెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you