తెలంగాణ వీణ , హైదరాబాద్ : సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవరర్గాన్ని మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దనట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని మంజు థియేటర్, ఆవులమంద, కళాసి గూడ, భర్తన్ కంపౌండ్ ప్రాంతాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలంతా ఆయనకు మంగళహారతులు పడుతూ సాధరంగా ఆహ్వానించి ఆశీర్వదించారు.. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటా తిరుగుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల మతాల ప్రజలకు సమన్యాయం చేశారని స్పష్టం చేశారు..