తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డి, ఎల్‌బీ నగర్, మిర్యాలగూడ, వైరా, ఇల్లందు, బాన్సువాడ, తుంగతుర్తి, భువనగిరి, మక్తల్, హుస్నాబాద్, హుజూరాబాద్, భోథ్ నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంది. ఎల్‌బీ నగర్ నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి టికెట్ ఆశిస్తుండగా, హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ కీలకంగా పనిచేశారు. ఇంకా తమ టికెట్ ఖరారు కాకపోవడంపై నేతలు అసంతృప్తిలో ఉన్నారు. నేటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 64 స్థానాల్లో 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. 10 నుండి 14 అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.