తెలంగాణ వీణ, సినిమా : దసరా కానుకగా విడుదలైన బాలయ్య చిత్రం ‘భగవంత్ కేసరి’ భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయింది. మరోవైపు ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కేవలం 6 రోజుల్లో 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది ఒక రికార్డ్ అని బుక్ మై షో సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.