తెలంగాణ వీణ , హైదరాబాద్ : సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు ఇస్రార్ అహ్మద్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాను గత 10 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.