తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. కేసీఆర్ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మళ్లీ కేసీఆర్ రావాలని, మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్నే నమ్ముతారని స్పష్టం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులల్లో తనపై కూడా కొన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు.