తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : చంద్రబాబు ఆరోగ్యం చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. పాలకొల్లులో ఆయనను హౌస్ అరెస్టు చేశారు. రాజమండ్రి వెళ్లకుండా నోటీసులు ఇచ్చి.. హౌస్ అరెస్ట్ చేయడంపై వైసీపీ ప్రభుత్వంపై అంగర రామ్మోహన్ మండిపడ్డారు. రాజమండ్రి ఏమైనా పాకిస్తానా? లేదంటే ఆఘ్ఘనిస్తాన్ లో ఉందా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ సర్కారు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో త్రీవ పరిణామాలుంటాయి. అని హెచ్చరించారు.