తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనిని అంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ అన్నారు. మండలంలోని అంబావల్లి, రెల్లివలస గ్రామాల్లో శనివారం ‘బాబుతో మేము’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, చివరకు న్యాయమే గెలిచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టు, వైసీపీ ప్రభుత్వ అరాచకపాలపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, నాయకులు చెట్టు శ్రీను, బర్రి సురేష్, కె.సింహాచలం, ఎస్.గోవింద, దారపు ఢిల్లేశ్వరరావు, గణేష్ తదితరలు పాల్గొన్నారు.
తర్లిపేట పంచాయతీలో శనివారం టెక్కలి నియోజకవర్గ టీడీ పీ నాయకులు బాబుతో మేము కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ టెక్కలి మండల అధ్యక్షుడు బగాది శేషు, సర్పంచ్ ఓడరేవు శ్రీనివాస్ నాయకులు తర్ర రామకృష్ణ, శిమ్మ నారాయణరావు, వెలమల కామేశ్వరరావు, వాన లక్ష్మి, కోరాడ గోవిందరావు, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం బాగు పాడాలని కోరుకుంటూ డోకులపాడులో మాజీ సర్పంచ్ అంబటి రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కాస పాపారావు, ఎం.రమేష్, లండ బాలకృష్ణ, అధిక సంఖ్యలో మహిళల పాల్గొన్నారు.