తెలంగాణ వీణ, క్రీడలు : గాయం కారణంగా వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇవాళ ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్ ఈ మ్యాచ్ ద్వారా బరిలో దిగనున్నాడు. స్టోక్స్ రాకతో ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 3 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే నెగ్గింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్… ఆ తర్వాత బంగ్లాదేశ్ పై నెగ్గింది. అయితే మూడో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ ఇంగ్లండ్ కు ఎంతో కీలకం.