తెలంగాణ వీణ, సినిమా : తమిళ నటి సునయన తెలుగువారికి కూడా పరిచయమే. రాజరాజచోళ, లాఠీ వంటి సినిమాల్లో నటించిన సునయన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉండటం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. బెడ్ పై ఆక్సిజన్ పెట్టుకుని ఆమె కనిపించింది. తనకు కొంత సమయం ఇవ్వాలని.. మళ్లీ తిరిగి వస్తానని ఆమె తెలిపింది. అయితే తనకు ఏమయిందనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. సునయన త్వరగా కోలుకోవాలని సునయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.