తెలంగాణ వీణ , హైదరాబాద్ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని అన్నానగర్‌లో పలు బస్తీల్లో పాదయాత్ర చేసిన లాస్య నందిత.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన.. చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్ధించారు.
రసూల్ పుర, అన్నా నగర్‌తో పాటు ఇతర బస్తీల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంచినీళ్లు అందించిన ఘనత దివంగత ఎమ్మెల్యే సాయన్నది అని అన్నారు లాస్య. అదే విధంగా తన తండ్రి సాయన్న మంచి నీళ్లు, డ్రైనేజ్, కరెంట్, రోడ్లతో పాటు ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేసినట్లు లాస్య నందిత తెలిపారు.