తెలంగాణ వీణ , హైదరాబాద్ : దాదాగిరి చేస్తే సహించేది లేదు నోట్ల కట్టలతో టీకేట్ తెచ్చుకున్న వారికి భయపడే ప్రసక్తే లేదని మల్కాజిగిరి బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు . పార్టీ బీఫామ్ తీసుకున్న సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదనీ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మాడల్ గా తీర్చిదిద్ధుతానన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతల్లో నేడు స్వేచ్ఛయుత వాతావరణం నెలకొందన్నారు. అక్రమ కేసులు, దాడుల భయం నుంచి బయటపడ్డామనే ఆనందంతో పలువురు నేతలు పార్టీలో చురుకుగా పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. పార్టీ అభ్యర్థి విజయానికి సమిష్టిగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారికి గౌరవం దక్కడం లేదని , నోట్లకట్టలకే ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీలో ఏలాంటి సేవలు చేయకుండానే పార్టీ టీకేట్లు కట్టబెట్టే పరిస్థితి నెలకొందని విమర్శించారు.