తెలంగాణ వీణ , హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక స్కీములు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్లు బుచ్చిరెడ్డి, జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది.. ఎవరూ నమ్మొద్దు అని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ దొంగలకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు. మల్లారెడ్డి అంటే నమ్మకానికి, నాణ్యతకి, విశ్వాసానికి మారుపేరు అని చమత్కరించారు. జంగయ్య యాదవ్ పేరు బాగాలేదా..? వజ్రేష్ యాదవ్ అని ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన ఏమన్నా సినిమా యాక్టరా. పేరు మార్చుకొని వచ్చినంత మాత్రాన ప్రజలు నమ్మరు.