Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పోలీసుల త‌నిఖీలు.. రూ. 3.50 కోట్లు స్వాధీనం

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మహేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి.

ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నం అని తెలియజేసారు .

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you