తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక పై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపిక పై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు.
మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం.