తెలంగాణ వీణ, నాగర్ కర్నూల్ : అచ్చంపేట.రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అచ్చంపేట ఆర్డిఓ గోపి రామ్ హెచ్చరించారు .మంగళవారం అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల నియమ నిబంధనలపై సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల నేతలు ఎలాంటి సమావేశాలు నిర్వహించాలన్నా తప్పనిసరిగా అధికారుల పర్మిషన్ తీసుకోవాలని కోరారు . సమావేశాల సందర్బంగా మైక్ సెట్ ల ఏర్పాటు, బ్యానర్ ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు.వాట్స్ అప్ లో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట తాసిల్దార్ శైలేంద్ర కుమార్ వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.