తెలంగాణ వీణ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాయల్ లి ప్యాలెస్ లో బి ఆర్ ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు..ఈ కర్కరామానికి ముఖ్య అతిథి గా కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ ఇంచార్జ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో సమిష్టిగా పనిచేసే బి ఆర్ ఎస్ అభ్యర్థి లాస్య నందితను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,కంటోన్మెంట్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి లాస్య నందిత ప్రచారం ప్రారంభం కానున్నట్లు తెలిపారు.. నాయకులు కార్యకర్తలు అనే భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసే అభ్యర్థులకు కృషి చేయాలని సూచించారు..ముఖ్య నాయకులు అలకలు వీడి పార్టీ కోసం పనిచేసే విధంగా వారిని కలుపుకుపోతామని అన్నారు.. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కె సి ఆర్ స్థానిక శాసనసభ్యులు దివంగత నేత సాయన్న అభివృద్ధి చేశారని, ఆయన కూతురిని కూడా ఆదరించి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు..